- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో వర్షాలకు కూలిపోయిన వారికి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. గ్రామ సమస్యలు, పునరావాస కేంద్రంలోని వసతులు పరిశీలించి ఇబ్బందులు లేకుండా చూడాలని కార్యదర్శులకు సూచించారు. ర్యాగట్లపల్లి, మల్లుపల్లి గ్రామాలలో పారిశుద్ధ పనులు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ గ్రామపంచాయతీ సిబ్బంది చేత వేయించారు. రామేశ్వర్ పల్లి గ్రామంలో వాటర్ పైప్ లైన్ లీకేజ్ కి మరమ్మత్తు పనులు చేయించారు.
- Advertisement -