– అశ్వారావుపేట మండలం ఓటర్లు 30691 గా నమోదు
నవతెలంగాణ – అశ్వారావుపేట
సెప్టెంబర్ నెల చివరి కల్లా స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే కోర్ట్ ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్దం అవుతోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 28 నుండి సెప్టెంబర్ 2 లోపు మొదటి దేశంగా ఓటర్లు జాబితా ప్రకటన,వార్డుల విభజన,అభ్యంతరాలు స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది.దీంతో స్థానిక అధికారులు ఓటర్లు జాబితా తో సిద్దంగా ఉన్నారు.
ఈ నేపధ్యంలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో ఓట్లు గత ఎన్నికల సందర్భాలు పై కధనం. తెలంగాణ ఏర్పాటు అయ్యాక ప్రధమంగా అశ్వారావుపేట మండలంలో 2013 – 2014 లో సాదారణ స్థానిక ఎన్నికలు నిర్వహించారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదిక నాడు ఓటర్లు జాబితా రూపొందించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం..
అశ్వారావుపేట మండలం జనాభా : 59652
పురుషులు : 29689, స్త్రీలు : 29689
మొత్తం : 59652
కులాల వారీ జనాభా
గిరిజనులు : 23224
పురుషులు : 11665, స్త్రీలు : 11559
దళితులు : 6231
పురుషులు : 3119, స్త్రీలు : 3112
ఇతరులు : 30197
పురుషులు : 15179, స్త్రీలు : 15018
2013 సాదారణ స్థానిక ఎన్నికలు 16 పంచాయితీలకు నిర్వహించారు. ఆ ఎన్నికల ప్రకారం ప్రకారం ఓటర్లు : 35950
పురుషులు : 17701, స్త్రీలు : 18249
గిరిజనులు : 13832
పురుషులు : 6248, స్త్రీలు : 6554
దళితులు : 3783
పురుషులు : 1841, స్త్రీలు : 1942
బీసీ లు : 11406
పురుషులు : 5565, స్త్రీలు : 5841
ఓసీ లు : 7929
పురుషులు : 4047, స్త్రీలు : 3882
2018 లో సాదారణ స్థానిక ఎన్నికలు నూతన మండలాలు,పంచాయితీల ఏర్పాటుతో 30 పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రకారం ఓటర్లు : 37164
పురుషులు : 18254, స్త్రీలు : 18909
గిరిజనులు : 14009
పురుషులు : 6826, స్త్రీలు : 7183
దళితులు : 3808
పురుషులు : 1860, స్త్రీలు : 1948
బీసీ లు : 13404
పురుషులు : 6556, స్త్రీలు : 6879
ఓసీ లు : 5910
పురుషులు : 3011, స్త్రీలు : 2899
2025 లో నేడు జరగనున్న ఎన్నికల్లో 27 పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎందుకంటే అశ్వారావుపేటతో పాటు పేరాయి గూడెం, గుర్రాల చెరువు పంచాయితీలను కలిపి అశ్వారావుపేట మున్సిపాల్టీగా రూపొందించారు.
దీంతో 27 పంచాయితీలకు ఓటర్లు : 30691
పురుషులు : 14923, స్త్రీలు : 15766
ఇతరులు : 2