భద్రతా చర్యలు కట్టుదిట్టం
నవతెలంగాణ – ఉప్పునుంతల :
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని దాసర్లపల్లి, ఉప్పునుంతల మధ్య ఉన్న మొల్గర వంతెనను గురువారం అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ఎస్సై వెంకట్ రెడ్డి, తాహసిల్దార్ ప్రమీలతో కూడిన బృందం పరిశీలించింది. ఈ నేపధ్యంలో వర్షాకాలం కారణంగా నీటి మట్టం పెరగడంతో వంతెన భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. వంతెన రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి, కీలక పాయింట్ల వద్ద కానిస్టేబుల్స్, రెవెన్యూ సిబ్బందిని 24 గంటల పహారాకు మోహరించారు. ఈ సందర్భంగా నీటి మట్టాన్ని ప్రతి రెండు గంటలకు పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు వంతెన దాటరాదని హెచ్చరించారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, పిల్లలు, వృద్ధులు వంతెన సమీపానికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. వర్షాలు తగ్గే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ఎస్సై ఫోన్ నెంబర్ 8712657738 కి, డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని డీఎస్పీ స్పష్టం చేశారు.
దుందుభి వాగు వద్ద అధికారుల పర్యటన
- Advertisement -
- Advertisement -