హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ చమురు నౌకకు రక్షణ కల్పించామని గొప్పలు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత నాలిక కరుచుకున్నారు. సామాజిక మాధ్యమ వేదికలో పెట్టిన పోస్టును వెంటనే తొలగించారు. కీలకమైన హార్ముజ్ జల సంధిలో ఏ నౌకకూ తాము రక్షణగా వెళ్లలేదని అధ్యక్ష భవనం వివరణ ఇచ్చింది. ‘అంర్జాతీయ మార్కెట్లలో చమురు లభ్యత సరిగా ఉండేలా చూసేందుకు అమెరికా నౌకాదళం హార్ముజ్ జలసంధిలో ఓ ఆయిల్ ట్యాంకర్ ప్రయాణానికి విజయవంతంగా రక్షణ కల్పించింది’ అంటూ ఇంధన మంత్రి క్రిస్ రైట్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టి తర్వాత దానిని తొలగించారు. రైట్ పోస్టుతో అంతర్జాతీయ మార్కెట్లలో తొలుత చమురు ధరలు కొంతమేర తగ్గాయి. అయితే పోస్టును తొలగించిన తర్వాత అవి మళ్లీ పెరిగాయి. జలసంధిలో చమురు నౌకలకు రక్షణ కల్పించలేదని అధ్యక్ష భవనం పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ధృవీకరించారు
హార్ముజ్‌లో చమురు నౌకకు రక్షణ కల్పించలేదు : అమెరికా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



