ఎఫ్ పి ఓ చైర్మన్ ఏలేటి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ – చిన్నకోడూరు
రైతులు నూనె గింజల పంటలను అధికంగా సాగు చేయాలని ఎఫ్ పి ఓ చైర్మన్ ఏలేటి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం చిన్నకోడూరు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులు పొద్దుతిరుగుడు సాగుతో అధిక లాభాలు పొందవచ్చు అన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంట పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి జయంతి కుమార్, ఎఫ్ పి ఓ వైస్ చైర్మన్ అన్నాడి నాగిరెడ్డి, కార్యదర్శి మోసర్ల మధుసూదన్ రెడ్డి, ఏ ఈ ఓ లు శివ కుమార్, జమీల్, ప్రేమ్ సాయి, శ్రీకాంత్, శిరీష, ఝాన్సీ లక్ష్మి, నిర్మల వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
నూనె గింజల పంటలు అధికంగా వేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES