Saturday, December 13, 2025
E-PAPER
Homeజాతీయంసగటున 50 రోజులే ఉపాధి

సగటున 50 రోజులే ఉపాధి

- Advertisement -

ఐదేండ్లలో ఉపాధి హామీ చట్టం అమలుపై ప్రశ్నలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని పేదరికం నిర్మూలన, వలసలను అరికట్టడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని మోడీ సర్కార్‌ నిర్వీర్యం చేస్తోంది. దీని అమలు లోపభూయిష్టంగా ఉందని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తోన్నాయి. ఒకపక్క బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత, మరోవైపు ఆధార్‌ అనుసంధానం, ముఖ హాజరు (ఫేస్‌ అటెండెన్స్‌) వంటి చర్యల అమలుతో లక్షల మందిని ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాలు ఉపాధి హామీ పథకం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టం అవు తుంది. దేశంలో ఉపాధి హామీ కింద సగటున 50 రోజులు మాత్రమే ఉపాధి కల్పించారు. దీంతో ఉపాధి హామీపట్ల ప్రభుత్వం వైఖరి మరోసారి స్పష్టం అయింది. వాస్తవానికి ఈ పథకం కింద ఏడాదికి వంద రోజుల పాటు ఉపాధి కల్పించాల్సి ఉంది. కానీ మోడీ ప్రభుత్వం గత ఐదేండ్లుగా సగటున 50 రోజుల మాత్రమే ఉపాధి కల్పించింది.

శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివ ద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్‌ పాశ్వాన్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద గత ఐదేండ్లలో సగటున ప్రతి ఇంటికి 50.35 రోజుల ఉపాధి కల్పించినట్టు తెలిపారు. 2024-25లో ప్రతి కుటుంబానికి సగటున 50.24 పని దినాలు కల్పించారు. 2023-24లో ప్రతి కుటుంబానికి సగటున 52.07 రోజుల పని దినాలు, 2022-23లో ప్రతి కుటుంబానికి సగటున 47.84 రోజుల పని దినాలు, 2021-22లో ప్రతి కుటుంబానికి 50.07 రోజుల పని దినాలు, 2020-21లో ప్రతి కుటుంబానికి 51.54 రోజుల పని దినాలు కల్పించినట్లు తెలిపారు. మొత్తం మీద గత ఐద్లేంలో ప్రతి కుటుంబానికి సగటున 50.35 రోజుల పని దినాలు కల్పించినట్టు మంత్రి కమలేష్‌ పాశ్వాన్‌ తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉండేలా, డిమాండ్‌కు అనుగుణంగా సకాలంలో ఉపాధిని కల్పించడం, అమలును మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షిస్తుందని అన్నారు.

1,068 హెక్టార్ల రైల్వే భూమి ఆక్రమణ
దేశంలో 1,068 హెక్టార్ల రైల్వే భూమి ఆక్రమణకు గురైందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన తెలిపారు. 2025 మార్చి 31 నాటికి ఇండియన్‌ రైల్వేల ఆధీనంలో ఉన్న మొత్తం భూమి దాదాపు 4.99 లక్షల హెక్టార్లు కాగా, అందులో 1,068.54 హెక్టార్లు దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా కాలంగా ఆక్రమణకు గురయ్యాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -