తెలంగాణ ప్రభుత్వానికి టీజీఈజేఏసీ కృతజ్ఞతలు
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) నిరంతర కషి ఫలితంగా రాష్ట్ర స్థాయిలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (స్టేట్ లెవల్)ను 12 సంవత్సరాల తరువాత విజయవంతంగా పునరుద్ధరించారు. ఇది జీఓఎంఎస్ 185 జి.ఎ.(ఎస్.డబ్ల్యూ.) శాఖ, సెప్టెంబర్ 10 , 2025 ప్రకారం (9) శాశ్వత సంఘాలు/యూనియన్లతో కూడిన కౌన్సిల్‌గా ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ రాష్ట్ర కార్యవర్గం గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఇదే విధంగా మిగిలిన సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ నాయకులు మారం జగదీశ్వర్, చైర్మెన్, ఏలూరి శ్రీనివాసరావు సెక్రెటరీ జనరల్, దామోదర్ రెడ్డి, చావా రవి, ఎ. సత్యనారాయణ, ముజీబ్ హుస్సేన్, కస్తూరి వెంకటేశ్వర్లు, బి. శ్యామ్, కష్ణ యాదవ్, డాక్టర్ రామారావు, శ్రీనేష్, డాక్టర్ శ్రీరామ్ రెడ్డి, శ్రీకాంత్, హరికష్ణ, లక్ష్మణ్ గౌడ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరణ సందర్భంగా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES