Sunday, February 1, 2026
E-PAPER
Homeదర్వాజసంధ్యా తీరమున..

సంధ్యా తీరమున..

- Advertisement -

సుదూర.. దూర దూర దూర దూర
తీరాలకు ఆవల, శిఖరాలకు ఈవల
కెరటాలకు వెనుక, దిగంతాల లోపల
ఎక్కడ్నించో ఓ పక్షి ఎప్పట్నించో పిలుస్తోంది.
బహుశా, ఆ పాట లాలిపాట నుంచే
నీకూ లీలగా వినిపిస్తూ వుండొచ్చు.
నీ నీడకూ, నీకూ, నీకూ, మీ ఆవిడకూ
ఆవిడ నీడకూ, నీకూ
నీ నీడకూ, ఆ నీడకూ
మిగిలేదెపుడైనా క్రీనీడే.
సాయంత్రం నెమ్మదిగా పట్టుబిగించి
పిడికిళ్లను వదులుజేసి
పొడవుగా సాగదీసేస్తుంది
నువ్వు తీవ్రంగా పెనుగులాడతావ్‌
కానీ, గ్రహించలేవు
అప్పటికే సాయంత్రమైందని.

దేశరాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -