- Advertisement -
తిరువనంతపురం : కేరళలో ఓనమ్ పర్వదినాలు మొదలయ్యాయి. పదిరోజుల పాటు సాగే ఈ పండగ రోజుల్లో ఓనం సాద్య పేరుతో సంప్రదాయ వంటకాలని వండివారుస్తారు. అనేక రకాల సంప్రదాయ వంటకాలను అరిటాకులో వడ్డిస్తారు. ఇలా రాష్ట్రంలోని ఓ కాలేజీలో 399 రకాల వంటకాలతో కూర్చిన ఓనం సాద్య గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకుంది. ఇందులో మొత్తంగా 204 మంది విద్యార్థులు, 11 మంది ఉపాధ్యాయులు భాగస్వాములు కావడం విశేషం.
- Advertisement -