ఓటర్ల చుట్టూ నిత్యం ఆశావాహుల ప్రదక్షిణల
వేడెక్కిన స్థానిక సమరం
నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. కలిసొచ్చిన రిజర్వేషన్లతో ఆశావహులు పోటీకి సిద్ధమైయ్యారు.తొలుత ప్రాదేశిక ఎన్ని కలు జరగనుండగా.. వీటిని పార్టీ సింబల్ నిర్వహించనున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్లు దక్కించుకునేందుకు ఆశావహలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.మరోవైపు ఎలాగైనా గెలుపొందలని ఆశావాహులు ఒక్క ఛాన్స్ పిలిజ్ అంటూ ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.పార్టీల టికెట్ల ఆశించిన ఆశావాహులు పార్టీ సీనియర్లతో నిత్యం సం ప్రదింపులు జరుపుతున్నారు.
ప్రధాన పార్టీలు స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు గుర్రాల కోసం కోసం అన్వేషిస్తున్నాయి. అన్వేషిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను అత్యధి కంగా గెలుచుకోవాలని కార్యాచరణ రూపొందిస్తు న్నాయి. ఇందుకోసం ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. ప్రతీ స్థానం నుంచి రెండు, మూడు పేర్లతో కూడిన జాబితా తీసుకుని ప్రజాదరణ ఉన్నవారిని ఎంపిక చేసేలా కసరత్తు చేస్తున్నాయి. బలాలు, బల హీనతలు, సామాజికవర్గాల మద్దతు, ఖర్చు భరిం చేస్థాయి, పరపతి గలవారు?.. ఇలా అన్ని కోణాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ఆరా తీస్తున్నాయి. వీటన్నింటినీ క్రోడీకరించి వడపోత తర్వాతే అభ్యర్థిని ఎంపిక చేయాలని అన్ని పార్టీల నేతలు లక్ష్యంగా నిర్దేశించారు. స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అంశంపై హైకోర్టు తీర్పు అనంతరం అభ్యర్థుల ప్రకటన చేయాలని,ఇప్పటివరకు ఎవరికీ భరోసా ఇవ్వొద్దనే భావనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఒక్కచాన్స్ ప్లీజ్.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES