Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వంద శాతం ఇంటిపన్ను వసూలు చేయాలి

వంద శాతం ఇంటిపన్ను వసూలు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
అందరి సహకారంతో 100% పన్నులు వసూలు చేసి పట్టణ అభివృద్ధి కి సహకరించాలని మున్సిపల్ చైర్ ర్సన్  గోనెలహరి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్  అధ్యక్షతన  మెప్మా ఆర్పీలకు పన్ను వసూళ్లపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. 100% ఇంటి పన్ను వసూలు చేయడానికి, మెప్మా ఆర్పీలు కూడా సహకారం అందించాలని కోరారు.

మెప్మా ఆర్పీలు మహిళా సంఘాల సభ్యులకు, ప్రజలకు ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ లు చెల్లించేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అందరి సహకారంతో 100% పన్నులు వసూలు చేసి  మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని చైర్ పర్సన్  అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ ఓ ఉమాదేవి, ఆర్ఐ అక్షయ్, మెప్మా టి ఎం సి ఉదయశ్రీ, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -