నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతనంగా అందిస్తున్న రోజుకు ఒక రూపాయి ఆర్థిక భరోసా కు సంబంధించిన పోస్టర్, బాండ్ ఆవిష్కరణ చేశారు. సోమవారం యాదగిరిగుట్ట, వారు మాట్లాడుతూ.. ఈ భరోసా వలన యాదాద్రి జిల్లా లో ఫోటో గ్రాఫర్స్ అందరికి ఆర్థిక సహాయం అందుతుంది అన్నారు.
తన కుటుంబ సభ్యులకు కూడా సహాయం అందించే దిశగా నిర్ణయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భోగ చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లా హరిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు యమల అప్పల రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు బొమ్మగాని గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు చాట్లపల్లి సిద్దు, పందిరి రమేష్, జిల్లా పి ఆర్ o భేతి రవి కుమార్ గారు, రామన్నపేట పి ఆర్ ఓ భాషమల్ల సంతోష్ కుమార్, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రే శ్యామ్, ప్రధాన కార్యదర్శి కందోజు రవి కిరణ్ గారు, భోగ శేఖర్, సంతోష్, స్వామి నాయక్, యాదగిరిగుట్ట మండల ఫోటోగ్రాఫర్స్ తదితరులు పాల్గొన్నారు.



