Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రణభేరి మాలల దూరంగా ఉండాలి 

రణభేరి మాలల దూరంగా ఉండాలి 

- Advertisement -

– తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ…
నవతెలంగాణ – బంజారాహిల్స్:
ఢిల్లీలో రణభేరి పేరుతో నిర్వహిస్తున్న సభ మాలలకు ఎటువంటి ఉపయోగకరం కాదని అది మాలల మోసభేరి అని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్, గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్, వర్కింగ్ చైర్మన్ మంత్రి నరసింహ, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేరా బాలకిషన్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాందాల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో మాలలకు ఆరు నెలలుగా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో జరిగిన అన్యాయాన్ని తెలియజేయడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో యాభై మంది నామినేషన్ వేస్తే 40 మందిని రిజెక్ట్ చేసినా పది మంది నియోజకవర్గం మొత్తం మాలలకు జరిగిన అన్యాయాన్ని వివరించామన్నారు. అధికార పార్టీ లోని మాల మంత్రులు తమ సమస్యల పరిష్కారం విషయం లో చొరవ చూపకపోవడం బాధాకరం అన్నారు. అంతే కాకుండా ఢిల్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న రణభేరి సభ మాలల మోసభేరి అని ఆ సభను బహిష్కరించాలని మాల సమాజానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో పలువురు మాల సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -