Friday, January 30, 2026
E-PAPER
Homeబీజినెస్తులం పసిడి రూ.1.79 లక్షలు

తులం పసిడి రూ.1.79 లక్షలు

- Advertisement -

ఒక్క రోజే రూ.11,770 ప్రియం
పసిడికి అధిక ధరల సెగ : డబ్ల్యూజీసీ వెల్లడి


ముంబయి : బంగారం ధర భగ్గుమంటోంది. గురువారం ఒక్క రోజే రూ.11వేలు పైగా ఎగిసింది. ఇటీవల బంగారం ధరలకు అమెరికా ఆజ్యం పోశింది. వెనిజులా అధ్యక్షుడు మదురోను డొనాల్డ్‌ ట్రంప్‌ దుర్మార్గంగా అరెస్ట్‌ చేయడం, ఇరాన్‌పై దాడులకు సంకేతాలు ఇవ్వడంతో భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామంతో డాలర్‌ కంటే భద్రతగా భావించే బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. అదే విధంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డ్‌ స్థాయిలో 92కు పడిపోవడం పసిడి ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణం.

ఈ పరిణామాల నేపథ్యంలోనే గురువారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.11,170 పెరిగి రూ.1,79,000కి చేరింది. 22 క్యారెట్ల పసిడిపై రూ.10,800 ఎగిసి రూ.1,64,100కి చేరింది. గుడ్‌రిటర్న్స్‌ ప్రకారం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ.1,78,850గా, 22 క్యారెట్ల ధర రూ.1,63,950గా నమోదయ్యింది. 10 గ్రాముల వెండిపై రూ.250 పెరిగి రూ.4,250గా, కిలో వెండిపై రూ.25,000 ఎగిసి రూ.4.25 లక్షలుగా పలికింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -