- Advertisement -
నవతెలంగాణ – నిజాంసాగర్
గత వారం రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి బుధవారం వరకు కూడా వరద నీరు భారీగానే కొనసాగుతుంది. బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు ప్రాజెక్టులోకి 75,207 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరగా.. 9 వరద గేట్ల ద్వారా మంజీరా నదిలోకి 49,113 క్యూసెక్కుల నీటిని వదలడం జరుగుతుంది అని ప్రాజెక్టు ఏఈఈ సాకేత్, అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 17.802టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 13.864 టీఎంసీల నీరు నిల్వ ఉంది అని వారు తెలిపారు.
- Advertisement -