Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లిలో కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు

కమ్మర్ పల్లిలో కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గత కొద్దిరోజులుగా పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామంలో అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నూతన పాలకవర్గం సభ్యులు నడుము బిగించారు. గ్రామంలోని పలు కాలనీల్లో ఉన్నఉన్న మురికి కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. రోజుకో కాలనీ చొప్పున  గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో గ్రామంలోని ఆయా కాలనీలో పూడుకుపోయిన మట్టి, మురికి కాలువల్లో చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు.

కార్మికులు  నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ ప్రతిరోజు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చెత్తాచెదారం మురికి కాలువల్లో వేయకుండా తడి చెత్త, పొడి చెత్తను ఇండ్లలో వేరువేరుగా నిలువుగా ఉంచి గ్రామపంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేసి సిబ్బందికి సహకరించాలన్నారు. ప్రజలు చెత్తాచెదారాన్ని మురికి కాలువల్లో వేయడం వల్ల మురికి కాలువలు కూడుకుపోయి మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తుందన్నారు. అంతేకాకుండా మురికి నీరు నిల్వ ఉండడం మూలంగా ఈగలు, దోమలు వృద్ది చెంది ప్రజలు అనారోగ్యాలకు గురవుతారన్నారు. మండలంలోని  కమ్మర్ పల్లిని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు గ్రామ పంచాయతీకి సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -