- Advertisement -
– జొమాటో బాటలోనే స్విగ్గీ ప్లాట్‌ఫారమ్ ఫీజు పెంపు
ముంబయి : ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేసే కోట్లాది మంది వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటోయ ఇటీవల తన చార్జీలను పెంచగా.. తాజాగా పోటీ సంస్థ స్విగ్గీ కూడా తన ప్లాట్‌ఫారమ్ ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి స్విగ్గీ ప్రతి ఆర్డర్‌పై ప్లాట్‌ఫారమ్ ఫీజును జిఎస్టితో కలిపి రూ.17.58కు పెంచింది. దీనికి ముందే జొమాటో కూడా జీఎస్టీ మినహా తన ఫీజును రూ.14.90కు పెంచడంతో ప్రస్తుతం రెండు ప్రధాన సంస్థల చార్జీలు దాదాపు ఒకే స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిణామం దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లపై ఆధారపడే మధ్యతరగతి వర్గాలకు భారం కానుంది.
- Advertisement -



