హైదరాబాద్ : హైదరాబాద్ పికల్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఓపెన్ పికిల్‌బాల్ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ముగిసింది. హైదరాబాద్‌లోని ప్యాడిల్‌వేవ్ స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో శర్వాణి చింతపల్లి, అనంత్ మణి ముని జోడీ 11-10, 11-10తో సష్టి చౌదరి, గోపి రెడ్డిలపై వరుస సెట్లలో మెరుపు విజయం సాధించి విజేతలుగా నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో వైశాక్ విఎస్ 11-10, 6-11, 11-0తో అనుతేజ్‌పై మూడు సెట్ల పోరులో పైచేయి సాధించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో గిరీశ్, విజరు తేజ్‌లు 15-11, 15-10తో గోపి రెడ్డి, సాయం బోత్రలపై అలవోక విజయం సాధించారు. హైదరాబాద్ పికిల్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీనివాస్ బాబు విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు ప్రదానం చేశారు. హెచ్‌పీఏ ప్రతినిధులు సుమిరన్ కొమ్మరాజు, శ్రీధర్ సహా నిర్వాహకులు కార్తీక్, సత్యదీప్, మహేశ్, సంజీత్, కిశోర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.