Monday, March 9, 2026
E-PAPER
Homeదర్వాజఆమెకు తలుపులు తెరవండి..!

ఆమెకు తలుపులు తెరవండి..!

- Advertisement -

ఆమె నవ్వు చినుకులా చిందితే ,
పుడమి పులకించి జలధారవుతుంది,
ఆ పాయని ఎందుకు అడ్డుకుంటారు..?
ఆమెను నదిలా ప్రవహించనివ్వండి..!
ఆమె అడుగు నేలని పండిస్తుంది,
ఆమె ఆలోచన ఆకాశమై విస్తరిస్తుంది,
ఆ స్వేచ్ఛను ఎందుకు బంధిస్తారు..?
ఆమెను ముందుకు సాగనివ్వండి..!
పుస్తకాల కంటే కలల్ని చదవనివ్వండి,
విహంగమై దూరాల్ని చేరనివ్వండి,
ఆ ధైర్యాన్ని ఎందుకు భయపెడ్తారు..?
ఆమె బాటే విజయ గీతికవుతుంది..!
ఆమె మాటలో మల్లెల సుగంధం,
ఆమె పాటలో స్వరాల మాధుర్యం,
ఆ గీతాన్ని ఎందుకు ఆపేస్తారు ..?
ఆమె పాడితే సమాజం పరవశిస్తుంది..!
ఆమె మౌనంలో ఒక అనుభవముంది,
ఆమె కంటి వెనుక ఒక స్వప్నం దాగుంది,
ఆ చూపును ఎందుకు దూరం చేస్తారు..?
ఆమె కాంతితో ప్రపంచం వెలుగుతుంది..!
నమ్మండి, దారివ్వండి, అవకాశం కల్పించండి,
ఆమె చూపిన దారి దేశానికి దీపమౌతుంది,
ఆ నడకకు ఎందుకు అడ్డుపడతారు..?
ఆమె సాఫల్యతకు తలుపులు తెరవండి..!

డా వాసాల వరప్రసాద్‌, 9490189847

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -