ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇర్ప విజయ
నవతెలంగాణ – తాడ్వాయి
మావోయిస్టుల ఏరువైత పేరుతో కర్రెగుటల్లో భద్రత బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, బిఆర్ఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు ఇర్ప విజయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతమైన ఐదు షెడ్యూల్ లోని వేలాది ఎకరాల్లోని విలువైన ఖనిజ సంపదను దోచుకునేందుకు, మావోయిస్టుల పేరుతో కర్రె గుట్టల్లో హెలికాప్టర్ ద్వారా బాంబులు పేల్చుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సరిహద్దుల్లో గల కర్రెగుట్ట యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుందన్నారు. సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి, గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయానక వాతావరణంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది సాయుధ పోలీస్ బలగాలు తిష్ట వేసుకొని ఏకపక్ష దాడుల్ని కొనసాగించడాన్ని ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. చతిస్గడ్- తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసి గ్రామాల్లో ప్రశాంతత కరువైందని, ఎప్పుడూ ఏం జరుగుతుందో అని పల్లె ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
- Advertisement -
RELATED ARTICLES