Monday, January 26, 2026
E-PAPER
Homeజిల్లాలుమన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం: ఎమ్మెల్యే తోట

మన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం: ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
దేశ అభివృద్ధి కోసం నేటి బాలలు రేపటి పౌరులుగా ఎదిగి విద్యార్థులే కీలక పాత్ర పోషించాలని, మన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఏర్పాటుచేసిన గణతంత్ర వేడుకల సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ నిర్వహించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను, అలాగే విద్యార్థిని విద్యార్థులు ఇచ్చిన స్పీచ్ లను చూసి ఎమ్మెల్యే ఎంతో ఆనందపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం దేశ అభివృద్ధి కోసం నేటి బాలలు రేపటి పౌరులుగా ఎదిగి విద్యార్థులు యువకులు కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

మన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం అని పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల సభకు స్థానిక మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ అధ్యక్షతన వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మండల విద్యాధికారి రాములు నాయక్ ఇతర అధికారులు, వివిధ పార్టీల నాయకులు, పంచాయతీ పాలకవర్గం, ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -