Wednesday, March 4, 2026
E-PAPER
Homeజాతీయంమన ప్రతిష్ట దిగజారిపోతుంది : రాహుల్‌

మన ప్రతిష్ట దిగజారిపోతుంది : రాహుల్‌

- Advertisement -

న్యూఢిల్లీ : ఖమేనీ హత్యపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించక పోవడం పట్ల కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌడీ సర్కార్‌ మౌనం వల్ల ప్రపంచ వేదికపై భారత్‌కు ఉన్న గౌరవం తగ్గిపోతుందని ఆయన అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ‘ఈ ఘర్షణపై భారత్‌ నైతికంగా, స్పష్టంగా వ్యవహరించాలి. అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, మానవ ప్రాణాల రక్షణ కోసం స్పష్టంగా మాట్లాడే ధైర్యం మనకు ఉండాలి. మన విదేశాంగ విధానం సార్వభౌమత్వం, వివాదాలు శాంతియుత పరిష్కారంపై ఆధారపడి ఉంది. ఎప్పటికీ అదే విధంగా కొనసాగాలి. ప్రపంచ వ్యవస్థను నిర్వచించే మార్గంగా ఒక దేశాధినేత హత్యకు ప్రధానమంత్రి మద్దతు ఇస్తారా? ప్రధాని మోడీ ఈ విషయంలో మాట్లాడాలి. ఇప్పుడైనా మౌనం వీడాలి. ఈ మౌనం ప్రపంచంలో భారత ప్రతిష్ఠను తగ్గిస్తోంది’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -