Sunday, February 15, 2026
E-PAPER
Homeజాతీయంసిట్టింగ్‌ జడ్జిలపై ఫిర్యాదుల వెల్లువ

సిట్టింగ్‌ జడ్జిలపై ఫిర్యాదుల వెల్లువ

- Advertisement -

– పదేండ్లలో 8వేలకు పైగా కంప్లైంట్‌లు
– 2024లో అత్యధికంగా 1170 ఫిర్యాదులు
– పార్లమెంటుకు కేంద్రం సమాచారం
– చర్యలపై ప్రశ్నకు స్పష్టత ఇవ్వని వైనం
– మేధావులు, న్యాయ నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ :
గత పదేండ్లలో సుప్రీంకోర్టు, హైకోర్టుల సిట్టింగ్‌ జిడ్జిలపై ఎనిమిది వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. ఈ విషయా న్ని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. ఒక సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈ వివరాలు వెల్లడించారు. 2016 నుంచి 2025 వరకు సంబంధించిన సమాచారాన్ని సభకు వివరించారు. కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం… సిట్టింగ్‌ జడ్జిలపై ప్రధాన న్యాయ మూర్తి కార్యాలయానికి 8630 ఫిర్యాదు లు అందాయి. ఇందులో 2024లో అత్యధికంగా 1170, 2020లో కనిష్టంగా 518 ఫిర్యాదులు వచ్చా యి. సభలో డీఎంకేకు చెందిన ఎంపీ మతెస్వరన్‌ విఎస్‌.. న్యాయమూర్తుల పై అవినీతి, లైంగిక దుర్వినియోగం, ఇతర తీవ్రమైన అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల జాబితాను కోరారు. అలాగే ఆ ఫిర్యాదులపై ఏ చర్యలు తీసుకు న్నారు, వాటి రికార్డులను నిర్వహించే వ్యవస్థ సుప్రీంకోర్టులో ఉందా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ విషయం లో కేంద్ర మంత్రి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడం గమనార్హం. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ‘ఇన్‌-హౌస్‌ ప్రొసీజర్‌’ ప్రకారం ఫిర్యాదులను స్వీకరించే అధికారాన్ని కలిగి ఉన్నారని కేంద్ర మంత్రి తెలిపారు.

‘ఇన్‌-హౌస్‌ ప్రొసీజర్‌’ అనేది చట్టబద్ధమైన వ్యవస్థ కాకుండా.. న్యాయవ్యస్థ అంతర్గతంగా రూపొందించుకున్న విధానం. అలాగే, సెంట్రలైజ్డ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (సీపీజీఆర్‌ఏఎంఎస్‌) ద్వారా లేదా ఇతర మార్గాల్లో వచ్చిన ఫిర్యాదులను సంబం ధిత ప్రధాన న్యాయమూర్తులకు పంపిస్తామని మంత్రి వివరించారు. జడ్జిలపై వేల సంఖ్యలో అందుతున్న ఫిర్యాదుల ఆందోళనకరమైన విషయమని మేధావులు, న్యాయ నిపుణులు చెప్తున్నారు. ”న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం ప్రజాస్వామ్యానికి మూలాధారం. పదేండ్లలో 8630 ఫిర్యాదులు రావడం ఒక ఆందోళనకరమైన విషయం. అయితే ఫిర్యాదుల సంఖ్య మాత్రమే సరిపోదు. ఆ ఫిర్యాదుల స్వభావం, వాటి విచారణ విధానం, తీసుకున్న చర్యలు కూడా పారదర్శకంగా తెలియజే యాలి. ఇన్‌ హౌస్‌ ప్రొసీజర్‌ చట్టబద్ధమైనది కాకపోవడం వల్ల బాధితులకు న్యాయం జరిగిందా లేదా అనే అనుమానాలు తలెత్తే అవకాశం ఉన్నది. ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం పారద్శకతపై అనేక సందేహాలను కలిగిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రత ఎంత ముఖ్యమో.. జవాబుదారీతనం కూడా అంతే కీలకం” అని వారు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -