నవతెలంగాణ – మోపాల్
మండలంలోని నర్సింగ్ పల్లి గ్రామంలో గల ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నరసింగపల్లి ఆలయంలో ప్రాంగణంలో గల వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం రోజున సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన వరి కోతలు మొదలయ్యాయి. పొలం మైసమ్మకు ముందుగా పూజలు చేసి ఆ తర్వాత అన్నపూర్ణా మాతకు పూజ చేసి ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీవారు నరసింహారెడ్డి గ వరి కోతలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రకృతి సేద్యంతో ఇటువంటి రసాయనాలు వాడకుండా ఈ పంటను పండించామని పైన తెలిపారు. పంటలు మంచిగా పండి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీమాన్ నరసింహ రెడ్డి గారు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇందూరు తిరుమల వ్యవసాయ క్షేత్రంలో మొదలైన వరి కోతలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES