నవతెలంగాణ – జక్రాన్ పల్లి : వరి కొనుగోలు కేంద్రాలను గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి వేగవంతంగా వడ్లను రైస్ మిల్లకు తరలించాలని మండల మాజీ కోఆప్షన్ నెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్ శనివారం అన్నారు. మండల కేంద్రంలో వరి కొనుగల్ కేంద్రంలో అమ్ముకొనుటకు రైతులు రోడ్లపై వరి ధాన్యాన్ని పోసి వర్షానికి నానా అవస్థలు పడుతున్నారని, వేగవంతంగా వడ్లను కొనుగోలు చేసి రైస్ మిల్లకు తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని మండల కో ఆప్షన్ మెంబర్ బులట్ అక్బర్ ఖాన్ ఆరబెట్టడానికి తన వంతుగా సహకారాన్ని అందించే ప్రయత్నం చేశారు. వాతావరణ పరిస్థితులను గమనించి ప్రభుత్వము రైతుల యొక్క వడ్లను త్వరగా కొనుగోలు చేసి త్వరగా రైస్ మిల్లుకు చేరే విధంగా ప్రయత్నాలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వేగవంతంగా వడ్లను రైస్ మిల్లకు తరలించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



