- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
టీ సాట్ నెట్వర్క్ , టీఎస్ జిహెచ్ఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన క్విజ్ పోటీలో వలిగొండ మండలం పహిల్వాన్ పురం గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి అక్షిత్ ప్రథమ స్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏం మహాలక్ష్మి తెలిపారు. అక్షిత్ జిల్లా స్థాయి పోటీలలో మొదటి స్థానం సంపాదించి, జోనల్ స్థాయికి ఎంపిక కావడం గర్వ కారణమని పాఠశాల యజమాన్యం పేర్కొంది. విద్యార్థిని అభినందించిన వారిలో ఉపాధ్యాయులు కస్తూరి, కేశవ లాల్, అరుంధతి, సరితా దేవి, కృష్ణమూర్తి, స్వర్ణలత, ఎండి ఇస్మాయిల్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మంగమ్మ, తల్లిదండ్రులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
- Advertisement -



