Monday, February 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపైసా వసూల్‌ సినిమా

పైసా వసూల్‌ సినిమా

- Advertisement -

ఎల్‌ఎ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద హేమంత్‌ కుమార్‌, అయానా, గోపీక సురేష్‌ ప్రధాన పాత్రల్లో విజయ్ ఎన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆల్ఫా’. మెన్‌ లవ్‌ వెంజన్స్‌ అనేది ఉప శీర్షిక . హేమంత్‌ కుమార్‌, ఆనంద్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 20న రిలీజ్‌ చేయబోతున్నారు. తెలుగులో రవిశంకర్‌, మంజునాథ్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. హీరో హేమంత్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘రవిశంకర్‌ కన్నడలో మా కంటెంట్‌ చూసి నచ్చి, ఈ చిత్రాన్ని తీసుకున్నారు. ఆ నమ్మకంతోనే తెలుగులో భారీ ఎత్తున రిలీజ్‌ చేస్తున్నారు. ప్రేక్షకులు పెట్టే డబ్బులకు సరిపోయే ఎంటర్టైన్మెంట్‌ను మేం అందిస్తాం.

కన్నడలో మాకు మంచి స్పందన వస్తోంది. ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు. ‘ఈ చిత్రంలో నేను పోలీస్‌ ఆఫీసర్‌గా నటించాను. అది నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. మా సినిమా అద్భుతంగా ఉంటుంది’ అని అయానా చెప్పారు. డిస్ట్రిబ్యూటర్‌ రవిశంకర్‌ మాట్లాడుతూ,’కన్నడ ట్రైలర్‌ చూసి ఈ మూవీని తీసుకున్నాను. హీరో పర్ఫామెన్స్‌ చూసి షాక్‌ అయ్యాను. టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ అన్నీ చూశాను. అద్భుతంగా అనిపించాయి. హీరోగా హేమంత్‌ పేరు ఇకపై ఎక్కువగా వినిపిస్తుంది. ఈనెల 20న మా సినిమా రాబోతోంది. ఇకపై భారీ ఈవెంట్‌లతో పెద్ద స్థాయిలో ప్రమోషన్స్‌ చేస్తాం’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -