నవతెలంగాణ – జన్నారం
ఇందన్పల్లి రేంజ్ లో పాలగొరి శివారులో చెట్లు నరికి జైలుకి వెళ్లి కండీషన్ బెయిల్ పైన విడుదల అయిన 26 మంది హాజరు అయ్యి సంతకాలు పెట్టడం జరిగిందని ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. 26 మందికి కోర్టు షరతులతో కూడిన కండిషన్ బెయిల్ ఇచ్చిందన్నారు. ఇందులో ముద్దాయిలు ఎక్కడ చెట్లు నరికినా కోర్ట్ ధిక్కారణ కింద బెయిల్ రద్దు అవుతుందన్నారు. ప్రతి సోమవారం రేంజ్ కార్యాలయంలో హాజరై సంతకాలు పెట్టాలన్నారు. సాక్ష్యాలు మార్చరాదన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు, అనాధికార టేకు కలపను వాడాకూడదని, బిపివిసి,డబ్ల్యూపిసి UPVC,WPC లాంటి రెడీ మెట్ ధర్వజలు, తలుపులు వాడుకోవాలన్నారు. అక్రమంగా చెట్టు నరికితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. అడవులను సంరక్షించడంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.



