- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని మీడియాతో మాట్లాడుతూ.. 4,200 సర్పంచ్‌స్థానాలకు 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. తొలి దశ ఎన్నికలకు డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తామన్నారు. రెండో దశ ఎన్నికలు 14న, మూడో దశ ఎన్నికలు 17న నిర్వహిస్తామని చెప్పారు. నామినేషన్లకు ఎల్లుండి నుంచే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
- Advertisement -



