- Advertisement -
జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్ హరిత
నవతెలంగాణ – దుబ్బాక
మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు జరుగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మండల పరిధిలోని హబ్సిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ ను సోమవారం జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్ హరిత పరిశీలించారు. పోటీ చేయకూరు అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ అన్ని విధాల సహకారం అందించాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట అడిషనల్ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ వేలేటి భాస్కర శర్మ, ఎంపీఓ నరేందర్ రెడ్డి, ఫ్లయింగ్స్ స్క్వాడ్ ఎల్లయ్య, పలువురున్నారు.
- Advertisement -



