Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలులంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, కొందరు సిబ్బంది లంచాలకు అలవాటు పడుతూనే ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళా పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అధికారికంగా చేయాల్సిన పని కోసం ఆమె ఒక వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసి, తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన సోమవారం వెలుగుచూసింది.సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం పరిధిలోని బుధేరా గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న పట్లోళ్ల నాగలక్ష్మి ఏసీబీకి పట్టుబడ్డారు. తన ఓపెన్ ప్లాట్‌కు కొత్త నంబర్ కేటాయించాలని, అదేవిధంగా వాటర్ సర్వీసింగ్ సెంటర్ షెడ్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఒక వ్యక్తి పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ పనులు పూర్తిచేయడానికి కార్యదర్శి నాగలక్ష్మి సదరు వ్యక్తి నుంచి రూ.8,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు వల పన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, కార్యదర్శి నాగలక్ష్మి ఫిర్యాదుదారు నుంచి రూ.8,000 లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad