Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బావిలో పడ్డ శునకాన్ని కాపాడిన పంచాయతీ సిబ్బంది

బావిలో పడ్డ శునకాన్ని కాపాడిన పంచాయతీ సిబ్బంది

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని గాజుల బావిలో శుక్రవారం ఉదయం శునకం పడిపోయింది. బావిలో నుండి అరుస్తున్న శునకం అరుపులను విన్న గాజుల బావి కాలనీవాసులు సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ సమాచారం అందించారు. వెంటనే ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి గాజుల భావి వద్దకు చేరుకున్నారు. బావిలో పడ్డ సునకాన్ని బయటకు తీసేందుకు గ్రామపంచాయతీ సిబ్బంది ఒకరు బావిలోకి దిగి శునకం నడుముకు తాడును కట్టడంతో పైన ఉన్న ఉప సర్పంచ్ అశోక్ గ్రామపంచాయతీ సిబ్బంది శునకాన్ని పైకి లాగారు. బావిలో శునకం పడ్డ విషయం తెలిసిన వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టి బావిలో నుండి శునకాన్ని బయటకు తీయించిన ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ ను పలువురు గ్రామస్తులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -