Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్న షక్కర్గ సర్పంచ్ అభ్యర్థిగా పాండురంగ పాటిల్

చిన్న షక్కర్గ సర్పంచ్ అభ్యర్థిగా పాండురంగ పాటిల్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ప్రస్తుతం మద్నూర్ మండలంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మండలంలోని చిన్న షక్కర్గా సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హైకమాండ్ పాండురంగ పార్టీలను బలపరిచినట్లు మండలాధ్యక్షులు ధరాస్ సాయిలు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు చిన్న షక్కర్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పాండురంగ పాటిల్ కు మద్దతుగా శుక్రవారం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాండురంగ పాటిల్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పటేల్ కు మద్దతుగానే ప్రచారంలో పాల్గొనాలని కోరారు. రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దిగంబర్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటే పార్టీపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పాండురంగ పాటిల్ ప్రచారం ముమ్మరంగా కొనసాగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -