- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని ముత్యం పల్లి, అమ్రాద్ గ్రామాల్లో ఉమెన్స్ కాలేజ్ కాంటేశ్వర్ నిజామాబాద్ వారు నిర్వహించే జాతీయ సేవా పథకం శీతాకాల శిబిరం నాలుగవ రోజు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాలింటర్లు ఆద్వర్యంలో గ్రామ ప్రజలకు స్వచ్చత పరిశుభ్రతపై అవగాహన చేశారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు. పేపర్ బ్యాగులను ఇంటింటికీ అందజేశారు. అనంతరం చిన్న పిల్లల వైద్యులు శ్రీశైలం మాట్లాడుతూ వర్షాల వల్ల వచ్చే వ్యాధులను వివరించారు. పలు జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కే. మాధవి, అర్. మమత, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -