Saturday, September 20, 2025
E-PAPER
Homeజాతీయంపేపర్‌ కప్‌లూ ప్రమాదమే

పేపర్‌ కప్‌లూ ప్రమాదమే

- Advertisement -

ఇక గ్లాస్‌, స్టీల్‌ పాత్రలే వాడాలి
పంచాయతీ స్థాయిలో ప్రజా చైతన్యానికి నడుం బిగించిన కేరళ సర్కార్‌

తిరువనంతపురం : ప్లాస్టిక్‌ ఫుడ్‌ కంటెయినర్ల కు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్న పేపర్‌ కప్‌ల వల్ల ఎదురవుతున్న ముప్పులను కేరళ అసెంబ్లీ గుర్తించింది. కంటికి కనిపించని రీతిలో మైక్రో ప్లాస్టిక్స్‌, విషపూరితమైన లోపలి పూత వల్ల ఈ పేపర్‌ కప్‌లు కూడా ప్రమాదకారిగానే తయారయ్యా యని అసెంబ్లీ శుక్రవారం ప్రముఖం గా పేర్కొంది. ప్రజల్లో దీనిపట్ల చైతన్యం తీసుకువచ్చేందుకు వీలుగా పంచాయితీ స్థాయిలో ప్రజా చైతన్య ప్రచారం మొదలుపెడుతున్నట్లు స్థానిక సంస్థల శాఖ మంత్రి ఎం.బి.రాజేష్‌ ప్రకటించారు. ప్లాస్టిక్స్‌కు బదులుగా గ్లాస్‌, స్టీల్‌ పాత్రలను ఉపయోగించేలా ప్రజల్లో అవగాహన పెంచాలని, ఇందుకోసం ప్రచారం చేపట్టాలని కోరారు. ముఖ్యంగా వందమందికి పైగా హాజరయ్యే కార్యక్రమాల్లో ఇది తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. యూజ్‌ అండ్‌ త్రో సంస్కృతిని కేరళ విడనాడాలన్నారు.

పేపర్‌ కప్పు భూమిలో కలవడానికి వందేండ్లు
ఫాస్ట్‌ఫుడ్‌ దుకాణాల నుండి ఇంటికి వేడిగా వుండే పదార్ధాలను తీసుకెళ్ళడానికి ఉపయోగించే వాటితో సహా ఇటువంటి ఉత్పత్తుల వాడకం బాగా పెరిగిపోయిందని, దీనివల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావా లు పడడమే కాకుండా పర్యావరణపరంగా కూడా తీవ్ర ముప్పు పొంచి వుందంటూ స్థానిక సంస్థల శాఖ మంత్రి ఎం.బి.రాజేష్‌ దృష్టికి జనతాదళ్‌ (సెక్యులర్‌) ఎంఎల్‌ఎ మాథ్యూ థామస్‌ తీసుకెళ్ళారు. సాంప్రదాయసిద్ధంగా వాడే పాత్రలకు బదులుగా చవకగా దొరికే, సులభంగా వాడి పారేసే పేపర్‌ కప్‌లు వాడకం అన్ని ఫంక్షన్లలో, కార్యకలాపాల్లో పెరిగిందని థామస్‌ పేర్కొన్నారు. ఆ కప్‌ల్లో వాడే లోపలి పూతలో భారీ లోహాలు, మైక్రో పాస్టిక్స్‌ ఆనవాళ్ళు వుంటాయన్నారు. అటువంటి వాటిల్లోని ఆహారం తిన్నందువల్ల తెలియకుండానే ప్రజల శరీరంలోకి అవన్నీ వెళ్ళిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌ కప్పులు, పాత్రలు, ప్లేట్లు, చేతి సంచులు ఇవన్నీ పార్కులు, బీచ్‌లు, గార్డెన్లు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ చూస్తే అక్కడ కుప్పలుగా పడి వుంటున్నాయని వీటిని శుభ్రపరచడం మున్సిపల్‌ సిబ్బంది భారంగా మారుతోందని అన్నారు. ముఖ్యంగా వారాంతపు దినాలు, పండగ రోజులు, ఉత్సవాల సందర్భంగా ఈ పరిస్థితులు మరింత దారుణంగా వుంటున్నాయన్నారు. పేపర్‌ కప్పులు తొందరగా భూమిలో కలిసిపోతాయనే భావన ప్రజల్లో వుందని కానీ ఒక కప్పు నేలలో కలిసిపోవడానికి వంద సంవత్సరాలు పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్‌ షంషీర్‌ కూడా ఆందోళన చెందుతూ మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -