నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డి మందును నిషేధిస్తూ చట్టసభల్లో తీర్మానం చేయడం అభినందనీయమని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్పర్సన్, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ హెల్త్ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ కవితా రెడ్డి తెలిపారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. ఇదే విధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పారాక్వాట్ గడ్డి మందును పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పారాక్వాట్ వాడకం వల్ల భూమి సారవంతత దెబ్బతినడంతో పాటు రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీని వినియోగం దీర్ఘకాలంలో పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో పారాక్వాట్ గడ్డి మందు నిషేధానికి సంబంధించిన తీర్మానం ఆమోదించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి డాక్టర్ కవితా రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ఆరోగ్య పరిరక్షణకు ఇది కీలక నిర్ణయమని ఆమె అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా పారాక్వాట్ నిషేధించాలి: డా. కవితా రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



