Friday, July 4, 2025
E-PAPER
Homeజాతీయం21 నుంచి పార్లమెంట్‌

21 నుంచి పార్లమెంట్‌

- Advertisement -

– నెల రోజుల పాటు వర్షాకాల సమావేశాలు
– 19న అఖిలపక్ష సమావేశం
– షెడ్యూల్‌ ప్రకటించిన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు జరగవని కిరణ్‌ రిజిజు తెలిపారు. సమావేశాల నేపథ్యంలో 19న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కిరణ్‌ రిజిజు గురువారం ప్రకటించారు.


కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం
వాస్తవానికి ముందుగా పార్లమెంట్‌ సమావేశాలు ఆగస్టు 12తో ముగియనున్నట్టు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు భావిస్తోంది. అందులో అణుశక్తి రంగంలో ప్రయి వేటు సెక్టార్‌లో ప్రవేశాన్ని అనుమతించే చట్టాలతో పాటు అటామిక్‌ ఎనర్జీ చట్టం, సివిల్‌ లయబిలిటీ ఫర్‌ న్యూక్లియర్‌ డ్యామేజ్‌ యాక్ట్‌లో సవరణలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకటనను అమలు చేయడానికే ఈ వారం రోజుల వ్యవధిని పొడిగించినట్టు సమాచారం.


విపక్షాలు డిమాండ్స్‌ ఇవే
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు అనేక సార్లు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతోపాటు భారత్‌-పాక్‌ మధ్య యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు రెండు భాగాలుగా జరిగాయి. మొదటి సమావేశం జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకూ కొనసాగింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల రెండవ భాగం మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్‌ 4న ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -