నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పస్రా పోలీసులు 24 గంటల్లో దొంగతన కేసు ఛేదన – ముగ్గురు నిందితుల అరెస్ట్, రూ.16 లక్షల సొత్తు రికవరీ ఈనెల 08.11.2025 రాత్రి బుస్సాపూర్ గ్రామానికి చెందిన పుల్యాల రజిని ఇంట్లో జరిగిన దొంగతనంపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పస్రా ఎస్ఐ తేదీ 9.11.2025 న క్రైమ్ నంబర్ 249/2025 U/s 331(4), 305(a) బి ఎన్ ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు గ్రేవ్ నేచర్ కావడంతో, దానిని వెంటనే సీఐ పస్రా శ్రీ పి. దయాకర్ కి బదిలీ చేయడం జరిగింది. సీఐ పి. దయాకర్ ఎస్‌ఐ ఏ. కమలాకర్, ఎస్‌ఐ సతీష్, ఎస్‌ఐ ఆంజనేయులు, సిసిఎస్ సిబ్బంది, మరియు క్లూస్ టీమ్ సహకారంతో దర్యాప్తు చేపట్టారు. సమర్థవంతమైన విచారణ వలన, దొంగిలించిన బంగారు ఆభరణాలు మరియు నగదు రూ.2,10,000/-, మొత్తం విలువ రూ.16,10,000/-ను రికవరీ చేయడం జరిగింది.
దర్యాప్తులో బుస్సాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ దొంగతనంలో పాల్పడినట్లు తేలింది:
1. కుక్కల రాజు, సన్నాఫ్ వెంకన్న,(30)
2. కండెల పద్మ, వైఫ్ ఆఫ్ కేశవులు,(30)
3. పెరుమాండ్ల భాగ్యలక్ష్మి, వైఫ్ ఆఫ్ దేవేందర్, (30)
నిందితులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరియు ఫిర్యాదుదారు ఇంట్లో నగదు ఉందని ముందుగా తెలుసుకొని ఈ దొంగతనానికి పాల్పడ్డారు. సీఐ పి. దయాకర్ నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.ఈ కేసును కేవలం 24 గంటల్లోపే చేదించిన పస్రా పోలీసు బృందంలోని సీఐ పస్రా, ఎస్‌ఐలు, సిసిఎస్ సిబ్బంది, క్లూస్ టీమ్ లను ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ డా. శబరిష్, పి., ఐపీఎస్. మరియు ములుగు ఎస్డిపిఒ శ్రీ ఎన్. రవీందర్ అభినందించారు.
రికవరీ చేసిన ఆస్తి వివరాలు
1. గుత్తుల నెక్లెస్ – 20 gms
2. కటింగ్ బాల్ చైన్ – 10 gms
3. పుష్పరాగ ఉంగరం – 5 gms
4. లవ్ షేప్ కమ్మలు – 2.5 gms
5. బీరకాయ బుట్టలు (1 జత) – 2.5 gms
6. ఒక జత బుట్టాలు – 2 gms
7. రాళ్ల కమ్మలు (1 జత) – 4 gms
8. 4 చైన్‌లతో కూడిన కమ్మలు – 4.8 gms
9. 2 జతల కమ్మల బుట్టాలు – 20 gms
10. 2 జతల మాటీలు మరియు 3 బంగారు గుండ్లు – 10 gms
11. మంగళసూత్రం – 40 gms
మొత్తం బంగారు ఆభరణాల బరువు – 120 gms, నగదు – ₹2,10,000/-, మొబైల్ ఫోన్లు – 02.



