పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత సర్పంచ్‌లు చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు నిబంధనల మేరకు చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారులకు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు చెల్లింపులకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేశారు. 15వ ఆర్థిక సంఘం కింద 2023-24 ఏడాదికి గాను గ్రామ పంచాయతీలకు టైడ్ కాంపొనెంట్ క్రింద రూ.245 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి బేసిక్ అన్‌టైడ్, టైడ్ గ్రాంట్స్ కింద రూ. 640.07 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు.
గత సర్పంచ్‌ల పదవీకాలం 01.02.2024తో ముగిసిన నేపథ్యంలో, 2023-24 సంవత్సరానికి విడుదలైన టైడ్ కాంపొనెంట్ నిధులతో చేపట్టిన తాగునీరు, పారిశుధ్య పనులకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉన్న మేరకు మాత్రమే గత సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించవచ్చని స్పష్టం చేశారు. టైడ్ కాంపొనెంట్ కింద విడుదలైన నిధులపై గత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులను రికార్డులు సరిచూసి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉన్న నిధుల నుంచి మల్టీ పర్పస్ వర్కర్ల వేతనాలు చెల్లించాలని సూచించారు.
గత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు చెల్లించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



