- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలో ఐజేపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సీఈవో, డి ఆర్ డి ఎ పిడి సాయ గౌడ్ బుధవారం తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం రికార్డులను ఆయన పరిశీలించారు. రైతులకు గన్ని బస్తాల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం మోహన్, కంప్యూటర్ ఆపరేటర్ తస్లీమా, డ్వాక్రా గ్రూపు మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -