Monday, October 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆ ప్రాంతం ఇస్తేనే ఉక్రెయిన్‌తో శాంతి

ఆ ప్రాంతం ఇస్తేనే ఉక్రెయిన్‌తో శాంతి

- Advertisement -

ట్రంప్‌నకు తేల్చిచెప్పిన పుతిన్‌
మాస్కో : ఉక్రెయిన్‌లోని అత్యంత కీలకమైన ప్రాంతాన్ని తమకు అప్పగించాల్సిం దేనని మాస్కో పట్టు బడుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధినేత పుతిన్‌ మధ్య గత వారం జరిగిన సుదీర్ఘ ఫోన్‌కాల్‌ సంభాషణలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్టు శ్వేతసౌధం అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనంలో పేర్కొంది. దొనెట్స్క్‌ ప్రాంతాన్ని మాస్కో సేనలు స్వాధీనం చేసుకోవడానికి దాదాపు 11 ఏండ్ల నుంచి వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

తాజాగా దీనిని తమకు అప్పగించి తీరాల్సిందేనని పుతిన్‌ పట్టుపడుతుండటంతో.. యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల ఫోన్‌ కాల్‌లో పుతిన్‌ ఓ ప్రతిపాదనను ట్రంప్‌ ఎదుట ఉంచినట్టు తెలుస్తోంది. ఇప్పటి తమ సేనల ఆధీనంలో ఉన్న జపొరిజియా, ఖేర్సాన్‌ ఉక్రెయిన్‌కు అప్పజెప్పేందుకు సానుకూలతను వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా ఉక్రెయిన్‌ దొనెట్స్క్‌ ప్రాంతాన్ని సంపూర్ణంగా తమకు అప్పగించాలని కోరినట్టు వాషింగ్టన్‌ పోస్టు కథనంలో వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -