Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గండివేట్ లో ఘనంగా పీర్ల పండుగ 

గండివేట్ లో ఘనంగా పీర్ల పండుగ 

- Advertisement -

మత సామరస్యానికి ప్రతీక కాశీం దూల సవారీ
జిల్లా నుండే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు రాక 
నవతెలంగాణ – గాంధారి

 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని గండిపేట్ గ్రామంలో పీర్ల పండుగ ఉమ్మడి జిల్లాలో మరెక్కడా లేనివిధంగా ఘనంగా జరుపుకుంటారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి కాకుండా పక్కరాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తుల వస్తుంటారు. కందుర్లులతో మొక్కులు చెల్లించుకుంటారు. మొహారం నెల వచ్చిందంటే చాలు ఈ ఊరు ఊరంతా కులం మతం అనే తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలు పాటిస్తరు.

గండివేట్ లోని అదిరా ఖానాలో కొలువై ఉన్న కాసిం దూలలను కష్టాలు దూరం చేసే దైవంగా ఆరాధిస్తారు. గ్రామంతో అనుబంధం ఉన్నవారు ఎక్కడ ఉన్నా మొరహం నెలలో జరిగే ఖాసిం దూల సవారీ చూసేందుకు తప్పకుండా వస్తారు. పండుగకు వారం రోజుల ముందు నుంచే భక్తులు కాశీం దూలలకు మొక్కులు చెల్లించుకుని, కందుర్లు చేయడం ప్రారంభిస్తారు. సవారి జరిగే విధానం మొహరం నెలలో మూలం కనబడిన మరుసటి రోజున గ్రామంలో అధిక నాలోని కాశి దూల వీరితోపాటు అబ్బాస్ అలీ మౌలాలి హుస్సేన్ బి బి ఫాతిమా గ్రామంలోకి ప్రతిష్ఠిస్తారు. ఆ రోజు నుంచి వీరు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐదో రోజు తరువాత రోజుకు వీరు చెప్పిన ఈ విధంగా గ్రామంలో ఊరేగిస్తారు.

పూర్వం ఇరు గ్రామాల మధ్య గొడవ: కాశీం దూలం దొంగతనం

పూర్వం గండివేట్ గ్రామంలోని కాశి ఖానా లో కొలువై ఉన్న కాసిం దూల వీరిని దొంగలు ఎత్తుకెళ్లారు అని గ్రామస్తులు చెబుతుంటారు. వీరులను ఎత్తుకెళ్లిన దొంగలు వెల్లుట్ల గ్రామ శివారులోని ఆడియో అటవిలో వదిలిపెట్టి చనిపోయినట్లుగా తెలిపారు. వెల్లుట్ల గ్రామ శివారులో దొంగల దోపిడి వదిలిపెట్టిన కాశిందులను తమదంటే తమదని వెల్లుట్ల గండివేట్ గ్రామస్తుల మధ్య ఘర్షణ జరిగిందని, ఇరు గ్రామస్తులు ఇరువర్గాలు ఒప్పందానికి వచ్చి కాశీ దులను ఏ  గ్రామస్తులు పైకి ఎత్తితే ఆ గ్రామానికి చెందుతుందని నిర్ణయించారు. అయితే కాసిం దూల వీరిని పైకి ఎత్తడం వెల్లుట్ల గ్రామస్తులు సాధ్యం కాలేదని, గండివేట్ గ్రామస్తులు కాశి దూల వీరినికి ప్రత్యేక పూజలు చేసి పైకెత్తి దాన్ని తీసుకువచ్చి తిరిగి ప్రతిష్టించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -