యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
P.6. వెల్లంకి గ్రామంలో అధికారులతో కలిసి కలెక్టర్ పల్లెనిద్ర
నవతెలంగాణ – రామన్నపేట
రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతు వేదికలో జిల్లా, మండల స్థాయి అధికారులతో గ్రామ ప్రజల మధ్య గ్రామ అభివృద్ధి పై, సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామంలో నిర్వహిస్తున్న అభివృద్ధి, అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను అందించారు. వైద్యశాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్, సివిల్ సప్లై, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల శాఖ, ఇతర శాఖల అధికారులు తమ శాఖల అభివృద్ధి అంశాలపై ఈ సందర్భంగా వివరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలలో అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటే గ్రామ ప్రజలందరూ సౌకర్యంగా ఉండడంతో పాటు క్షేమంగా ఉంటారని అన్నారు. గ్రామ ప్రజల సమస్యలు, గ్రామ అభివృద్ధి అంశాలు తెలుసుకోవడానికి పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. నేను నాతో పాటు కొందరు అధికారులు గ్రామంలోనే నిద్రిస్తారని, ఉదయం 6 గంటలకు గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలు, అభివృద్ధిపై క్షేత్ర పరిశీలన ఉంటుందని ఆయన సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కరరావు, స్థానిక తహసిల్దార్ లాల్ బహదూర్, ఎంపీడీవో రాములు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులు అందుబాటులో ఉంటే ప్రజలకు క్షేమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES