కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేరాలపల్లి మనోహర్
నవతెలంగాణ – తిమ్మాజిపేట
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం పట్ల కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు నేరాలపల్లి మనోహర్ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి ఈ ఎన్నికల నిదర్శనమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఎజెండాకు ఈ ఎన్నికల ద్వారా ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారని అన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ప్రజలు మరింత ప్రోత్సాహం ఇచ్చారని తెలిపారు. భారీ విజయం సాధించిన నవీన్ యాదవ్ కు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని మరోసారి నిరూపించారని అన్నారు ఈ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



