– తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఎంపీడీవో ఉమర్ షరీఫ్
నవతెలంగాణ – జన్నారం
కురుస్తున్న భారీ వర్షాలు అనే పద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఎంపీడీవో ఉమర్ షరీఫ్ అన్నారు. మండలంలోని రోటి గూడ తపాలాపూర్, చింతాగుడా, మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీలో అధిక వర్షాలకు నీరు నిలిచిన ప్రదేశాలను పరిశీలించి జెసిబి సాయంతో సమస్యను పరిష్కరించారు. రోటి గూడ గ్రామంలో వండెరె వాగు ఉధృతంగా ప్రవహించడంతో అటువైపు ఎవరు వెళ్లకూడదని , ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అధిక వర్షాలకు నదులు,వాగులు,చెరువులు, కల్వర్టులు బ్రిడ్జిల దగ్గరకు వెళ్ళవద్దు అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిదన్నారు. కరెంటు స్తంభాలు,వైర్లను ముట్టుకోవద్దన్నారు. చిన్నపిల్లలను ఇంట్లోనే ఉంచండి, బయటకు రానివ్వదు తల్లిదండ్రులకు సూచించారు. భారీ వానలు వరదలు నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES