సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు గొంది రాజేష్
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో కోతుల బారి నుండి ప్రభుత్వం ప్రజలను కాపాడాలని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కమిటీ సభ్యుడు గొంది రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ(ఎం) పసర గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కోతుల సమస్య పరిష్కరించాలని ప్లే కార్డులతో చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. పసర గ్రామంలో ప్రతి ఇల్లు కోతుల సమస్యతో బాధపడుతుందని తెలిపారు. ఇప్పటికే వేలాదిమంది కోతుల బారినపడి గాయాల పాలయ్యారని అన్నారు. ఇండ్లల్లో ఉన్న సామాన్లకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. చిన్నపిల్లలు బిక్కుబిక్కుమంటు భయాందోళన చెందుతున్నారని అన్నారు. స్కూల్ విద్యార్థులు స్కూలుకు వెళ్లాలంటే అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు.
కోతుల సమస్య సామాజిక సమస్యగా మారిందని కోతుల నివారణకు గ్రామపంచాయతీ ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో కోతుల నివారణకు చట్టం ఉందని అన్నారు. అందుకోసం మన రాష్ట్రంలో సైతం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతుల పంట పొలాలు కోతుల ద్వారా నష్టం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో చిరు వ్యాపారులు పండ్ల వ్యాపారులు వ్యాపారం చేసుకోలేని పరిస్థితులు తలెత్తేయని, రోడ్డుపై ప్రయాణికులు వెలలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కోతుల నివారణ చేపట్టాలని అన్నారు. లేనియెడల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దశల వారి పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.
అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు నిరసన తెలిపి పంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు తుమ్మల వెంకటరెడ్డి,పొదిళ్ల చిట్టిబాబు, తీగల ఆగి రెడ్డి, మండల కమిటీ కార్యదర్శి సోమ మల్లారెడ్డి గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు గ్రామ శాఖ కార్యదర్శిలు వల్లపు రాజు జిట్టబోయిన రమేష్, శ్రీరామోజు సువర్ణ, చిన్నపల్లి అశోక్, పిట్టల అరుణ్, బుర్ర శీను, కొట్టే కృష్ణారావు ,సిరిపెల్లి జీవన్, పురుషోత్తం రెడ్డి, గణేష్, మాధాసు శ్రావణ్, నదునూరి పుష్ప, ఇలియాస్, శ్రావణ్, ఉదయ్, కొండయ్య, ఐలయ్య ,సత్యనారాయణ, సామ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కోతులు బారి నుండి ప్రజలను రక్షించాలి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES