నవతెలంగాణ – హైదరాబాద్: గత రెండేళ్లుగా అసెంబ్లీకే రాని కేసీఆర్ రాబోయే మూడేళ్ల తర్వాత అధికారంలోకి ఎలా వస్తారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా గురువారం ఆయన ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ..కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రజలు కేటీఆర్ సెంటిమెంట్ పాలిటిక్స్ నమ్మి మరోసారి మోసపోవద్దని హెచ్చరించారు. కాళేశ్వరం పేరుతో, ధరణి పేరుతో గత ప్రభుత్వం రాష్ర్ట సంపదను దోచుకుందని ఆరోపించారు. హైదరాబాద్ నగర అభివృద్దికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు. ఓటు వేసేముందు ప్రతి ఒక్కరు ఆలోచించి, అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించి, నగర అభివృద్దికి తోడ్పాటు అందించాలని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు.
ప్రజలు కేటీఆర్ సెంటిమెంట్ పాలిటిక్స్ ను నమ్మి మోసపోవద్దు: మంత్రి కోమటిరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



