Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జన వికాస సేవలను సద్వినియోగం చేసుకోవాలి 

జన వికాస సేవలను సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేముల వెంకన్న 
నవతెలంగాణ – పెద్దవంగర
: గ్రామీణ ప్రాంతాల్లో జన వికాస స్వచ్ఛంద సంస్థ వారు అందిస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు వేముల వెంకన్న, మెయిన్ కోఆర్డినేటర్ మద్దెల రమ కోరారు. ఉప్పరగూడెం గ్రామంలో తొర్రూరు మెడికేర్ హాస్పిటల్ సౌజన్యంతో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో వారు పాల్గొని మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నివాస ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ సరిత, వైద్యులు నరేష్, రాధాక్రిష్ణ, కిరణ్ కుమార్, శ్రీకాంత్, గ్రామస్తులు మేనక, రమ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -