Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎండాకాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి

ఎండాకాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి

- Advertisement -
  • మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి బాయి 
  • నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
  • గత రెండు మూడు రోజులుగా ఎండలు విపరీతంగా పెరిగాయని, ఎండ కాలంలో ప్రజలు జాగ్రత్తా ఉండాలని సుల్తాన్ బజార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి బాయి అన్నారు.  సుల్తాన్ బజార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఎండాకాలంలో పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తమ ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి తమ ఆశ వర్కర్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. అంగన్వాడి సెంటర్లు, బస్ స్టేషన్లు, చౌరస్తాల వద్ద, చలివేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. వేడిని తట్టుకునేందుకు ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు.
  • పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని సూచించారు. రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలన్నారు. ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలని చెప్పారు. పసి పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలన్నారు. చిన్న పిల్లలకు తల్లి పాలు తప్పని సరిగా పట్టించాలని చెప్పారు. వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల న్నారు. అలాగే అత్యవసర సమయాల్లోనే బయటకు వెళ్లాలన్నారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు గొడుగు వెంట తీసుకెళ్లాలని సూచించారు.
  • ప్రజలు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని,పోషకాలుండే వాటర్ మిలన్, ద్రాక్ష, కర్బూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవడం శరీరంలో వేడి తగ్గడంతోపాటు విలు వైన పోషకాలు లభిస్తాయన్నారు. కీరదోష, క్యారట్, బీట్రూట్ లాంటి పచ్చికూర గాయలను తీసుకో వాలని సూచించారు.  బీపీ, షుగర్ వ్యాధులకు మందులను ఉచితంగా అందిస్తున్నామన్నారు. అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  పి హెచ్ ఎన్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -