Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంతలసరి జీడీపీ పెరగాలి

తలసరి జీడీపీ పెరగాలి

- Advertisement -

– జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి
– అసమానతలు పోకుండా
– అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలేం : ఎస్వీకే వెబినార్‌లో ఆర్థిక రంగ విశ్లేషకులు పాపారావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

దేశంలో తలసరి జీడీపీ పెరగకుండా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలేమని సీనియర్‌ జర్నలిస్ట్‌, ప్రముఖ ఆర్థిక రంగ విశ్లేషకులు డి పాపారావు వ్యాఖ్యానించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుకాకుండా ఏ దేశం కూడా అభివృద్ధి చెందినట్టు కాదని అభిప్రాయపడ్డారు. పాలకులు దేశ ప్రజల మధ్య అసమానతలు రూపమాపకుండా ఫలితాలు రావని చెప్పారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘టాప్‌-3లోకి భారత్‌ నిజంగానే వెళ్లనుందా ?’ అనే అంశంపై జరిగిన వెబినార్‌లో మాట్లాడారు. దీనికి ఎస్‌వికే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ వృద్ధాప్యం నేపథ్యంలో వెనుకబడ్డ జపాన్‌తో పోటీపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ దేశం జీడీపీలో వెనుకబడిన అంశాన్ని గుర్తు చేశారు. 2024లోనే జపాన్‌ను అధిగమించామని తెలిపారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఈవిషయమై స్పందిస్తూ ‘గుడ్డివాళ్ల రాజ్యం..ఒంటి కన్ను రాజు’ అనే సామెతను గుర్తు చేశారన్నారు. మన దేశంలో యువత ఎక్కువని గుర్తు చేశారు. అపారమైన మానవ వనరులను వినియోగించుకోవాలని సూచించారు. గొప్పలు తగ్గించి పని మీద దృష్టిపెట్టాలని భారత సర్కారుకు హితవు పలికారు. 2027-28లో జర్మనీని దాటేస్తామని చెబుతున్నారని గుర్తు చేశారు. జీడీపీ వేగంగా పెరుగుతుందని చెప్పుకుంటున్నారని అన్నారు. మన దేశం చైనాతో పోటీపడాలని అభిప్రాయ పడ్డారు. ప్రపంచంలో అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో యువత అమెరికా వెళ్లడానికి ఆసక్తిగా లేరని అన్నారు. ఈ పరిస్థితి నిరుద్యోగాన్ని పెంచుతుందన్నారు. రియాల్టీపై యువత ఆధారపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఉత్సాహపూరిత వాతావరణం లేదన్నారు. దీంతో ఉపాధి అవకాశాలు పడిపోతున్నా యని చెప్పారు. అమెరికా విధించిన 50 శాతం పన్నులు సైతం నిరుద్యోగాన్ని పెంచుతుం దన్నారు. ఎగుమతులపైనా ఇది ఉంటుందన్నారు. టెక్స్‌టైల్‌, లెదర్‌, బంగారం వ్యాపారాలపై పన్నుల ప్రభావం తీవ్రంగానే ఉంటుందని గుర్తుచేశారు. సంపదను సృష్టిస్తున్నామని అంటున్నారనీ, సంపద పంపిణీ జరగాల్సి ఉందని అన్నారు. అలా జరగ కపోతే కొనుగోలు శక్తి తగ్గుతుందన్నారు. కనీస వేతనాలు పెరగకపో యినా, కొనుగోళ్లు నెమ్మదిస్తాయని చెప్పారు. దీంతో ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావమే ఉంటుందన్నారు. బీజేపీ స్వదేశీ, హిందూత్వలను నమ్ముతుం దన్నారు. స్వదేశీలోనూ స్పష్టత లేదన్నారు. హిందూత్వ మూలంగా సమాజం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రజల మధ్య మతం చిచ్చుపెట్టి విభజన చేస్తుందన్నారు. ప్రస్తుతం అమెరికా పరిస్థితి ‘మా ఇంటికొస్తే ఏం తెస్తావు..మీ ఇంటికొస్తే ఏం ఇస్తావు’ అనే పద్ధతిలో నడుస్తు న్నదన్నారు. మెడికల్‌, ఆహార రంగాల్లో వ్యాపారం పడిపోతున్నదని వివరిం చారు. దీంతో లక్షలాది మంది జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని చెప్పారు. స్వదేశీ జపం చేస్తూ, విదేశీ ఎజెండా అమలుచేయడాన్ని తప్పుబట్టారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad